Saturday, 01 August 2026 03:52:35 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఉరి వేసుకొని తాపీ మేస్త్రి ఆత్మహత్య

Date : 05 May 2026 06:40 PM Views : 117

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : మద్యపానానికి బానిసైన గజ్జెల్లి అశోక్ (35), అనే తాపీ మేస్త్రి రెబ్బెన మండలం, గోలేటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే అశోక్‌కు 11 సంవత్సరాల క్రితం రమ్యతో వివాహం కాగా వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అశోక్ గత 6 సంవత్సరాలుగా మంథని మండలం, రామయ్యపల్లిలో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తూ, అక్కడ మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, మద్యానికి బానిసైన అశోక్, మద్యం సేవించి ఇంటికి వచ్చిన ప్రతిసారీ తన భార్యతో గొడవపడేవాడు. ఈ విషయంలో అశోక్ తల్లి శశికళ అతడికి అంతలా సర్ది చెప్పిన అశోక్ ప్రవర్తన లో మార్పు రాలేదు. ఇదిలా ఉండగా గత నెల 30వ తేదీన, ఎప్పటిలాగే మద్యం సేవించి ఇంటికి వచ్చిన అశోక్, తన భార్యతో గొడవపడి, రెబ్బెన మండలం, గోలేటిలో నివసిస్తున్న తన తల్లి వద్దకు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. అయితే, సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అశోక్, రాత్రి 10.30 గంటలకు ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అతని తల్లి అంత పిలిచినా తలుపు తెరవకపోవడంతో, ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపు తెరిచి చూడగా, అతను ఇంట్లోని ఉరి వేసుకుని కనిపించాడు. ఆ తర్వాత 108కి సమాచారం అందించగా, అతడిని అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అశోక్ మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి శశికళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :