Sunday, 02 August 2026 03:14:54 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఆర్చి లైట్ కంపెనీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా మందమర్రి టోల్‌గేట్‌లో పెట్రోలింగ్ వాహనాల డ్రైవర్ల సమ్మె

Date : 19 June 2026 05:26 PM Views : 152

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఆర్చి లైట్ కంపెనీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మందమర్రి టోల్‌గేట్ వద్ద పెట్రోలింగ్ వాహనాల డ్రైవర్లు, హెల్పర్లు, ఆర్‌పీఓలు నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగారు ఐఎఫ్‌టీయూ నాయకులు మాట్లాడుతూ, తమ పోరాటాల ఫలితంగా గతంలో కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, జీవో ప్రకారం కనీస వేతనాలు, పండుగ రోజుల్లో డ్యూటీ చేసిన వారికి డబుల్ వేతనం, జాతీయ పండుగ మాస్టర్లు తదితర హక్కులు సాధించుకున్నామని తెలిపారు. అయితే ఇటీవల ఈ టోల్‌గేట్‌కు ఇన్‌చార్జిగా వచ్చిన జితేందర్ కార్మికుల మధ్య విభేదాలు సృష్టిస్తూ, యూనియన్‌కు దూరంగా ఉండాలని ప్రలోభపెట్టారని ఆరోపించారు. అనంతరం పాత డ్రైవర్లను తొలగించి కొత్త డ్రైవర్లను నియమించడం, యూనియన్‌తో కుదిరిన ఒప్పందం కంటే తక్కువ వేతనాలు చెల్లించడం, పీఎఫ్ నిధులను తక్కువగా జమ చేయడం, పండుగ రోజుల్లో డ్యూటీ చేసిన వారికి అదనపు వేతనాలు ఇవ్వకపోవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.డ్రైవర్లు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కంపెనీ యాజమాన్యం కాలరాస్తోందని, అందుకే ఆర్చి లైట్ కంపెనీకి వ్యతిరేకంగా సమ్మె చేపట్టినట్లు తెలిపారు. ఈ సమ్మెకు భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్‌టీయూ) పూర్తి మద్దతు ప్రకటించింది. కార్మికులు కోల్పోయిన హక్కులను పునరుద్ధరించే వరకు, అలాగే అక్రమంగా తొలగించిన అంబులెన్స్ డ్రైవర్‌ను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ఐఎఫ్‌టీయూ నాయకులు స్పష్టం చేశారు.ఈ సమ్మెలో మంచిర్యాల జిల్లా ఐఎఫ్‌టీయూ కార్యదర్శి డి. బ్రహ్మానందం, జిల్లా నాయకులు ఎస్. తిరుపతి రెడ్డి, ఎండీ జాఫర్ పాల్గొని తమ మద్దతు తెలిపారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: