Saturday, 01 August 2026 03:48:49 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు

బీఎస్పీ ఆధ్వర్యంలో నివాళులు

Date : 11 April 2026 06:40 PM Views : 56

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆస్పరెంట్ అకాడమీలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, విద్యార్థులు కలిసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు.ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు మాట్లాడుతూ.అణగారిన వర్గాల అభ్యున్నతికి, విద్య కోసం జ్యోతిరావు పూలే చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. విద్యార్థులు మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని, వారి బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సమాజంలో మార్పు రావాలంటే విద్య ఒక్కటే మార్గమని పూలే నమ్మారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ ఇంచార్జ్ కాదాసి రవీందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్, ఈసీ మెంబర్ ఎండి మాతిన్ ఖాన్, నాయకులు నాగుల కిరణ్ బాబు, అడ్వకేట్ నటేశ్వర్, ముత్యం నిహార్ వర్మ, మందమర్రి పట్టణ అధ్యక్షులు గాజుల శంకర్, నాయకులు ఆయిల్లా లక్ష్మణ్ మరియు అకాడమీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :