వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: మంచిర్యాల ఆర్టీసీ డిపో ఇన్‌ఛార్జి డిపో మేనేజర్‌గా కె. నరేశ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డిపో మేనేజర్‌గా విధులు నిర్వహించిన శ్రీనివాస్ పరకాల బదిలీ కావడంతో, ఆయన స్థానంలో కంటోన్మెంట్ డిపోలో అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్‌గా సేవలందిస్తున్న నరేశ్‌కుమార్‌ను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమించింది.బాధ్యతలు స్వీకరించిన అనంతరం నరేశ్‌కుమార్ మాట్లాడుతూ, ప్రయాణికులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన, సమయపాలనతో కూడిన రవాణా సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. డిపోలో బస్సుల నిర్వహణను మరింత మెరుగుపరచడంతో పాటు, ఉద్యోగుల సమన్వయంతో సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తానన్నారు.ప్రయాణికుల సంతృప్తే సంస్థ విజయానికి కొలమానమని పేర్కొన్న ఆయన, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రవాణా సేవలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని వెల్లడించారు. కొత్త ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టడంతో మంచిర్యాల డిపోలో సేవల నాణ్యత మరింత మెరుగుపడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.
Reporter
వాస్తవ గమ్యం