వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : దహేగాం మండలంలోని ఇట్యాల నుంచి గొర్రెగుట్ట వరకు ఎంఆర్ఆర్ పథకం కింద రూ.1.35 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్వహణ అధ్వాన్నంగా మారిందని, మరమ్మతులకు ప్రభుత్వం నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. గొర్రెగుట్ట నుంచి కేస్లాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం