వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : హైదరాబాద్/మేడ్చల్:ప్రేమ పేరుతో ఓ ఉన్మాది చేసిన పైశాచిక చర్య ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఎయిడ్స్ సోకిన రక్తాన్ని ఎక్కించి యువతి జీవితాన్ని నాశనం చేసిన ఘటనలో.ఆ వేదనను భరించలేక సదరు బాధితురాలు ప్రాణాలు వదిలింది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 11వ తేదీన ఈ దారుణం వెలుగుచూసింది.మనోహర్ అనే యువకుడు ఒక యువతిని పెళ్లి చేసుకోవాలని వేధించాడు. దానికి ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్న మనోహర్, అత్యంత అమానుషంగా ఆమెకు ఎయిడ్స్ పాజిటివ్ ఉన్న రక్తాన్ని బలవంతంగా ఎక్కించాడు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.నిందితుడు చేసిన పనికి శారీరకంగా, మానసిక వేదనకు గురైన ఆ యువతి, నేడు తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.బాధితురాలి ఫిర్యాదుతో గతంలోనే కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు మనోహర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను రిమాండ్‌లో భాగంగా జైలులో ఉన్నాడు.ఒక యువతి జీవితాన్ని చిదిమేసిన మనోహర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Admin
వాస్తవ గమ్యం