Saturday, 01 August 2026 01:33:45 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

బెల్లంపల్లి రైల్వే కార్మికుల సమస్యలు జీ ఎం,డీ ఆర్ ఎం ల దృష్టికి తీసుకువెళ్లి పరిస్కరిస్తా

సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్

Date : 09 April 2026 07:53 PM Views : 290

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజనల్ సెక్రెటరీ రవీందర్ తెలిపారు.గురువారం పట్టణంలోని రైల్వే మజ్దూర్ యూనియన్ కార్యాలయం లో జరిగిన యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి మొదటి బీ ఈ సీ సమావేశానికి పీ రవీందర్ ముఖ్యాతిధి గా హాజరైప్రసంగించారు.ఈ సందర్బంగా బెల్లంపల్లిలో రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను బ్రాంచ్ చైర్మన్ ఎస్ నాగరాజు సెక్రెటరీ జీ సాంబశివుడులు డివిజనల్ సెక్రటరీ కి విన్న వించారు. బెల్లంపల్లి లోకో పైలట్ వెయిటింగ్ హాల్ నిర్మించాలని,ఇంజనీరింగ్ పిడబ్ల్యూఐ ఆఫీసులలో మినీ వాటర్ ప్లాంట్ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు రవీందర్ ను కోరారు. అంతే కాకుండా లోకో పైలట్ లాబీ ఆర్వో ప్లాంట్ రిపేర్ చేసేలా,బెల్లంపల్లి క్రికెట్ గ్రౌండ్ అభివృద్ధి పరచాలని, బెల్లంపల్లి లో రైల్వే క్వాటర్స్ బ్యాక్ సైడ్ డ్రైనేజ్ కాలువ నిమించేలా రైల్వే ఉన్నతాధికారులదృష్టికి సమస్యలు తీసుకువెళ్లాలని వారు కోరారు. బెల్లంపల్లి రైల్వే కాలనీలో రైల్వే కార్మికుల క్వార్టర్స్ ను పూర్తిస్థాయిలో మరమత్తులు చేసేలా, మంచిర్యాల పాయింట్స్ మెన్ లకు ఎనిమిది గంటల పని విధానం. అమలుపరిచేలా చూడాలని,మంచిర్యాల లో ఆర్వో ప్లాంట్ వెంటనే ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలని వారు డివిజనల్ సెక్రెటరీ కి సమస్యలు విన్నవించగా ఈ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా డివిజనల్ సెక్రెటరీ బెల్లంపల్లి బ్రాంచి నాయకత్వానికి హామీ ఇచ్చారు. బెల్లంపల్లి బ్రాంచ్ లో ఉన్న అన్ని సమస్యల గురించి చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశం లో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్యూనియన్ జోనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ నవనీత్.బెల్లంపల్లి బ్రాంచ్ ట్రెజరర్ షాకింగ్ మీనా, ఇతర ఆఫీస్ బేరర్స్ వర్కింగ్ కమిటీ మెంబర్స్ ఎంప్లాయిస్ పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :