Friday, 31 July 2026 11:24:17 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఉత్తమ బీఎల్ఓగా పౌడాల రజితకు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రశంసా పురస్కారం

Date : 14 July 2026 11:35 AM Views : 91

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని 22వ బూత్ బీఎల్ఓ పౌడాల రజితకు ఉత్తమ సేవలకుగాను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రశంసా బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీలోగా ప్రతి బీఎల్ఓ తమ పరిధిలోని ప్రతి ఓటరితో ఎన్యూమరేషన్ ఫారమ్‌ను పూర్తిగా నింపించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఒక్క ఓటరు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.అలాగే, కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలు కూడా 22వ బూత్‌ను ఆదర్శంగా తీసుకుని, ఎక్కువ మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారమ్‌లను ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 22వ బూత్ బీఎల్ఓ పౌడాల రజిత సేవలను మంత్రి అభినందిస్తూ, అదే స్ఫూర్తితో మిగతా బీఎల్ఓలు, బీఎల్‌ఏలు పనిచేసి ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మందమర్రి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మంద తిరుమల్ రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ నర్సింగ్, పట్టణ అధికార ప్రతినిధి, 22వ బూత్ బీఎల్‌ఏ సట్ల సంతోష్ గౌడ్, పట్టణ ఉపాధ్యక్షుడు రాచర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :