Friday, 31 July 2026 11:26:16 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో మంచిర్యాల విద్యార్థుల ప్రభంజనం

Date : 27 April 2026 07:02 PM Views : 132

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : హైదరాబాద్‌లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు.తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారులు పతకాల పంట పండించారని జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రంగు శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.బంగారు పతకం విద్యార్థి అండర్ 61 కేజీల విభాగంలో మోక్షిత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు.రజత పతకాలు సబ్ జూనియర్ బాయ్స్ అండర్ 35 కేజీల విభాగంలో దీమన్,సబ్ జూనియర్ గర్ల్స్ అండర్ 36 కేజీలు విభాగంలో విజ్ఞ శ్రీ వెండి పతకాలు సాధించారు. ​కాంస్య పతకాలు అండర్ 41 కేజీల విభాగంలో శ్రీవాస్తవ, జెస్విత్ కాంస్యాలు గెలుచుకున్నారు.అండర్ 36 కేజీల విభాగంలో దేవర్శిస్ కాంస్యం సాధించారు. బాలికల విభాగంలో ఆరాధ్య అండర్ 33 కేజీలు, హ్రీధ్య అండర్ 36 కేజీలు,అవంతిక అండర్ 41 కేజీలు కాంస్య పతకాలు గెలుచుకున్నారు.రాష్ట్ర స్థాయిలో జిల్లా కీర్తిని చాటిన విద్యార్థులను మంచిర్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు అక్కల రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మెయిన్, రంజిత్ తదితరులు పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :