వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లాలోని వివిధ ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పోడు సాగుదారులైన ఆదివాసులు, పేదల భూముల్లో అటవీ శాఖ కందకాలు తవ్వడం, భూములు స్వాధీనం చేసుకునే చర్యలను నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు, బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.రైతులకు యూరియా, డీఏపీ, రైతుబంధు, బ్యాంకు రుణాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు, పుస్తకాల పేరుతో చేస్తున్న దోపిడీని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.
Reporter
వాస్తవ గమ్యం