వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జైపూర్ మండలం కుందారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పని ప్రదేశంలో శనివారం సర్పంచ్ కుక్కల వినోద చల్ల మజ్జిగ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను కూలీలకు పంపిణీ చేసి ఉపశమనం కలిగించారు.తీవ్రమైన ఎండల దృష్ట్యా ఉపాధి పనులకు వెళ్లే కూలీలు వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అభినందనీయమని స్థానిక కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.పని ప్రదేశానికి వెళ్ళిన సర్పంచ్, కూలీలకు స్వయంగా మజ్జిగ మరియు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పని ప్రదేశాల్లో నీడ ఉండేలా చూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ముదాం రమేష్, ఎల్కటూరి రాములు, కాంగ్రెస్ నాయకులు కుక్కల కిష్టయ్య, ఉష్క మల్ల రవి, సంతోషం చంద్రశేఖర్, పిడుగు వెంకటి, జంజేర్ల ఎల్లయ్యలతో పాటు యువ నాయకులు దండవేని మధుకర్, నిమ్మ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం