Sunday, 02 August 2026 02:56:39 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

సింగరేణికి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు.

మందమర్రి ఏరియాలో ఘనంగా విజయోత్సవాలు

Date : 13 July 2026 05:23 PM Views : 81

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి కాలరీస్ కంపెనీకి తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌ను ప్రభుత్వం నేరుగా కేటాయించడంపై మందమర్రి ఏరియాలో సోమవారం ఘనంగా విజయోత్సవాలు నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయంలో జరిగిన వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొని ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ, తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపు సింగరేణి చరిత్రలోనే కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ కేటాయింపుతో సంస్థ సుస్థిర భవిష్యత్తుకు బలమైన పునాది పడిందని, బొగ్గు ఉత్పత్తి పెంపుతో పాటు ఉద్యోగ భద్రత, కార్మిక సంక్షేమానికి ఇది ఎంతో దోహదపడుతుందని అన్నారు.సింగరేణి అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన, కొత్త బొగ్గు బ్లాక్ ద్వారా భవిష్యత్ తరాలకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, సంస్థకు దీర్ఘకాలిక స్థిరత్వం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.విజయోత్సవాల్లో భాగంగా మందమర్రి ఏరియా పరిధిలోని అన్ని గనులు, వివిధ విభాగాల కార్యాలయాల్లో మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, సీఎంఓఏఐ ప్రతినిధి సరిత, డీజీఎం (పర్సనల్) సిహెచ్. అశోక్, సీనియర్ పీఓ ఆర్. సత్యనారాయణతో పాటు అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు, కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :