Sunday, 02 August 2026 03:20:50 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు:

హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్

Date : 10 June 2026 06:19 PM Views : 76

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల చేతగానితనం వల్లే గత 14 నెలలుగా మెడికల్ బోర్డు సమావేశాలు జరగడం లేదని హెచ్ఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జెబిసీసీఐ సభ్యులు రియాజ్ అహ్మద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగుడా ఓసీపి వద్ద హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పతెం రాజబాబు అధ్యక్షతన బుధవారం ఘనంగా గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రియాజ్ అహ్మద్ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.గత 14 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేకమంది కార్మికులు విధులు నిర్వహించలేక నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తక్షణమే స్పందించి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల కనీసం రెండు సార్లయినా మెడికల్ బోర్డు సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగ నియామకాల కోసం ఎంతో కాలంగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న కార్మిక కుటుంబ సభ్యులకు ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా, పాత విధానంలోనే ఒకేసారి నియామక పత్రాలను అందజేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.కార్మికుల సమస్యల పరిష్కారానికి అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని రియాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. అలా కాకుండా ఏఐటీయూసీ నాయకత్వం ఇతర సంఘాలను సంప్రదించకుండా, ఒంటరిగా యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వడం కార్మికులను నట్టేట ముంచడమేనని విమర్శించారు. గుర్తింపు సంఘానికి నిజంగానే కార్మిక సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే.అన్ని సంఘాలను కలుపుకొని ఉమ్మడిగా సమ్మె నోటీసు ఇవ్వాలని హెచ్ఎంఎస్ తరపున సవాల్ విసిరారు.ఈ గేట్ మీటింగ్‌లో హెచ్ఎంఎస్ బ్రాంచ్ సెక్రటరీ ఎం. శివారెడ్డి, పిట్ సెక్రెటరీ దుర్గం వెంకటేష్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ ఎస్. కుమార్ గౌడ్, ఏరియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎస్కే ఇనూస్, ఏరియా క్లర్క్స్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కళ్యాణ్ కుమార్ మరియు పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్న

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: