Friday, 31 July 2026 09:16:44 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం

12వ ఆవిర్భావ వేడుకల్లో కేక్ కట్ చేసిన జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్.

Date : 23 July 2026 06:59 PM Views : 252

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ నిరంతరం పోరాడుతోందని టిజెఎ జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టిజెఎ) 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ నేతృత్వంలో ఈ వేడుకలను వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులు వృద్ధులకు అన్నదానం చేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అనంతరం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లాలోని జర్నలిస్టు నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.రాష్ట్రంలోని జర్నలిస్టులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి వారి ఐక్యతను చాటడంలో టిజెఎ కీలక పాత్ర పోషిస్తోందని నాయకులు పేర్కొన్నారు. సంస్థను రాష్ట్రవ్యాప్తంగా అగ్రగామిగా, బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ అందిస్తున్న సేవలు, క్రమశిక్షణ అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టుల సంక్షేమానికి, వృత్తిపరమైన రక్షణకు టిజెఎ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో టిజెఎ జిల్లా నాయకులు సారంగరావు,డేగ ఆంజనేయులు,గట్టయ్య, గంగులు,అమర్నాథ్ రెడ్డి,గౌతం,పురుషోత్తం, ప్రేమ్ జీవన్,సతీష్,వినీత్, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: