వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి/తుర్కపల్లి: ప్రభుత్వం రైతులే వెన్నెముక అని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో వారి సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు. తుర్కపల్లి గ్రామం నుండి కొత్త చెరువు పొలాల వైపు వెళ్లే నక్షా దారి పూర్తిగా అధ్వానంగా తయారవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్దాలుగా సాగు పనుల కోసం వినియోగిస్తున్న ఈ దారి ప్రస్తుతం గోతులమయమై, బురదతో నిండిపోయింది. దీంతో పొలాల్లోకి ట్రాక్టర్లు, ఎడ్లబండ్లు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పండిన పంటను ఇంటికి చేర్చుకోవడానికి రవాణా సౌకర్యం లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఈ సమస్యపై గతం లో సర్పంచ్, కార్యదర్శికి విన్నవించినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే నిధులు మంజూరు చేసి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని తుర్కపల్లి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Admin
వాస్తవ గమ్యం