Sunday, 02 August 2026 02:58:54 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మంచిర్యాల మున్సిపల్ నిధుల ఖర్చుపై విచారణ జరపాలి.

Date : 30 June 2026 03:48 PM Views : 248

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : 30: మంచిర్యాల మున్సిపాలిటీలో గత 12 ఏళ్లుగా జరిగిన నిధుల వినియోగంపై సమగ్ర విచారణ నిర్వహించాలని మేయర్ ధరణి మధుకర్ డిమాండ్ చేశారు. ఈ విచారణలో ఎవరిపై ఆరోపణలు నిజమని తేలినా, వారు ఎంతటి వారైనా చట్టపరంగా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, సోమవారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎజెండా పూర్తిగా చదవకముందే బీజేపీ కార్పొరేటర్లు వాకౌట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలు సూచించాల్సిన ప్రతిపక్షం, సమావేశాన్ని బహిష్కరించడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. మున్సిపల్ నిధుల వినియోగంపై ఎలాంటి సందేహాలు ఉన్నా ప్రభుత్వం లేదా సంబంధిత సంస్థలతో విచారణ జరిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నిజాలు ప్రజల ముందుకు రావాలని మేయర్ పేర్కొన్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :