Saturday, 01 August 2026 01:32:57 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

99 రోజుల ప్రజాపాలనకు డాక్యుమెంటేషన్ తప్పనిసరి

Date : 25 June 2026 08:32 PM Views : 176

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : 25: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో శాఖల వారీగా సాధించిన లక్ష్యాలు, ప్రజల సమస్యల పరిష్కారం, పెండింగ్ అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర డాక్యుమెంటేషన్ రూపొందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అధికారులను ఆదేశించారు.నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సాలిడ్, లిక్విడ్ వ్యర్థాల నిర్వహణ, తెలంగాణ జలసిరి కార్యక్రమం, ఇంకుడు గుంతలు, పంటకుంటల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆరోగ్య పరీక్షలు, విద్యార్థుల యూనిఫారాల తయారీ, మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. అలాగే మాదకద్రవ్యాల నిర్మూలన, పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన, విద్యాభివృద్ధి, పింఛన్ల జీవన ప్రమాణీకరణ, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలు వంటి అంశాల్లో అధికారులు చురుకుగా పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా పరిష్కరించాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో జిల్లాలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 10,305 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా, 2,132 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని వెల్లడించారు. బడిబాట, క్షయ నిర్మూలన, రహదారి భద్రత, బాలికల విద్య, రైతు అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.అనంతరం మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కమిషనర్ గ్రామపంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నియంత్రణ, వీధిదీపాల నిర్వహణ, గ్రామ ఆర్థిక వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :