Sunday, 02 August 2026 01:41:38 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

జంతు జనన నియంత్రణ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి

Date : 28 June 2026 07:42 PM Views : 315

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: జిల్లాలో ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య ఆదివారం విస్తృతంగా పరిశీలించారు. ఆండాళమ్మ కాలనీలోని జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని సందర్శించి వీధి కుక్కల జనన నియంత్రణ శస్త్రచికిత్సలు, జంతు సంరక్షణ, పరిశుభ్రతను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణను పరిశీలించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని సూచించారు.కాసిపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న గ్రామపంచాయతీ భవనం, నర్సరీ, పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించి నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కూడా పరిశీలించి అర్హులందరికీ ఫారాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.నెన్నెల, భీమారం మండలాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామపంచాయతీలను సందర్శించి వైద్య సేవలు, అభివృద్ధి పనులు, ఓటరు జాబితా సవరణ, ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పనులు, వనమహోత్సవ ఏర్పాట్లను సమీక్షిస్తూ పనులను వేగవంతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: