Friday, 31 July 2026 11:24:32 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

మందమర్రిలో ఘనంగా సింగరేణి యాజమాన్యం–ఏఐటీయూసీ 19వ స్ట్రక్చర్ మీటింగ్

Date : 29 June 2026 06:03 PM Views : 162

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 29: సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ అధ్యక్షతన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ తో 19వ స్ట్రక్చర్ మీటింగ్ సోమవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సౌహార్ద వాతావరణంలో జరిగింది.సమావేశంలో ఏఐటీయూసీ మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, రామకృష్ణపూర్ కార్యదర్శి అక్బర్ అలీతో పాటు పలువురు నాయకులు పాల్గొని కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ, సింగరేణి అభివృద్ధి, ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మిక సంఘాల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సంస్థ ఉత్పత్తితో పాటు ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. గత సమావేశంలో చర్చించిన అంశాల అమలుపై సమీక్ష నిర్వహించారు.అన్ని క్యాంటీన్లలో స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలి.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని టీ-టైప్ క్వార్టర్లకు నల్లటాప్ సీట్లు వేయాలి.గనులు, విభాగాల్లో ఖాళీగా ఉన్న క్లర్క్ పోస్టులను భర్తీ చేయాలి.జవహర్‌నగర్ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలి.యూనియన్ ప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించి, అర్హత ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్పత్తి లక్ష్యాల సాధనలో కార్మికులు, కార్మిక సంఘాలు అందిస్తున్న సహకారాన్ని అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇదే సహకారం కొనసాగించాలని కోరారు.ఈ సమావేశంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, కేకేఓసీ ప్రాజెక్ట్ అధికారి రాంబాబు, ఎస్‌కే గ్రూప్ ఏజెంట్ సంతోష్ కుమార్, డీజీఎంలు అశోక్, కిరణ్ కుమార్, సురేష్, షేక్ మదీనా భాష, డీవైపీఎం విజయ్ సందీప్, సీనియర్ పీఓ కార్తీక్‌తో పాటు ఏఐటీయూసీ సీనియర్ నాయకులు కంది శ్రీనివాస్, సి.వి. రమణ మరియు ఇతర అధికారులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :