Sunday, 02 August 2026 01:33:50 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

పార్క్ లో షీ టీమ్ డెకాయ్ ఆపరేషన్

Date : 06 July 2026 04:16 PM Views : 79

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్కులో మహిళలు, యువతుల భద్రతకు భంగం కలిగించే వారిపై షీ టీమ్ సోమవారం ఆకస్మికంగా డెకాయ్ ఆపరేషన్ నిర్వహించింది. షీ టీమ్ ఎస్సై హైమ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రత్యేక తనిఖీల్లో పార్కులో యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, వెక్కిలి చేష్టలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు. మహిళలు, బాలికలను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఈవ్‌టీజింగ్ వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హైమ హెచ్చరించారు.మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా వెంటనే షీ టీమ్ లేదా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించేందుకు ఇలాంటి డెకాయ్ ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో షీ టీమ్ సిబ్బంది శ్రవణ్, శ్రీలత పాల్గొన్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :