వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సోమవారం ఉద్రిక్త వాతావరణంలో సాగింది. మేయర్ ధరణి మధుకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎజెండాలోని పలు అంశాలపై చర్చించే అవకాశం కల్పించాలని బీజేపీ కార్పొరేటర్లు కోరగా, అందుకు మేయర్ అనుమతి ఇవ్వలేదని వారు ఆరోపించారు. దీనికి నిరసనగా బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేశ్ గౌడ్ నేతృత్వంలో ఆ పార్టీ కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిపోయారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం నిరాకరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ సభ్యులు విమర్శించారు.
Reporter
వాస్తవ గమ్యం