వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి పట్టణంలోని సీఐటీయు కార్యాలయంలో సీఐటీయు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా అధ్యక్షుడు అబ్బోజు రమణ, జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు సంకె రవి, దూలం శ్రీనివాస్, దాసరి రాజేశ్వరి, కాసిపేట రాజేశం, శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షుడు గట్టు మహేందర్ ఇటీవల మరో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి, అందులో కమిటీ సభ్యులుగా ఎన్నికైనట్లు పత్రికల ద్వారా తెలిసిందన్నారు.ఇది సీఐటీయు నిబంధనలు, పని విధానాలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్న వారు, సీఐటీయు జిల్లా కమిటీ నిర్ణయం మేరకు ఈ ఐదుగురిని సంస్థ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. ఇకపై వారికి సీఐటీయుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఐటీయు కార్మికులు, అనుబంధ యూనియన్లు, జిల్లాలోని కార్మిక సంఘాలు, అధికారులు, ప్రజా సంఘాల నాయకులు గమనించాలని వారు కోరారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సమ్మక్క, జిల్లా సహాయ కార్యదర్శులు వెంకటస్వామి, భానుమతి, జిల్లా కమిటీ సభ్యులు జి. ప్రకాష్, సి. దేవదాసు, ఎ. లక్ష్మణ్, ఎ. మౌలాలి, డి. రాజారాం తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం