వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామంలోని తిరుమల ఫంక్షన్ హాల్‌లో బుధవారం వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. యూత్ కాంగ్రెస్ నాయకులు బామండ్లపల్లి భారత్ సోదరుడు అరుణ్ కుమార్, హర్షిణిల వివాహానికి నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ ముఖ్య నాయకులు భారీగా హాజరయ్యారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారిలో: నాతరి స్వామి రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్) మత్తమారి సూరిబాబు (మాజీ మున్సిపల్ చైర్మన్) కరుకూరి రాంచందర్ (మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్) దూడం మహేష్ (బుగ్గ దేవాలయ కమిటీ చైర్మన్) బామాండ్లపల్లి స్వామి (కన్నాల 8వ వార్డు మెంబర్) వీరితో పాటు ఓబీసీ జిల్లా కో-చైర్మన్ బండి లక్ష్మణ్, నాయకులు ముత్తె భూమన్న, దుగ్నపల్లి మాజీ సర్పంచ్ సురేష్, అశంపల్లి నర్సయ్య, కుశ్నపల్లి మనోహర్, గోళ్ల రాజేందర్, బామండ్లపల్లి రాజం, సత్యనారాయణ, అక్కల శ్రీనివాస్, బియ్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను అక్షితలు వేసి ఆశీర్వదించారు.
Admin
వాస్తవ గమ్యం