Friday, 31 July 2026 09:13:49 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి

Date : 25 July 2026 08:18 PM Views : 120

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నీట్ పేపర్ లీకేజీ ఘటనల నేపథ్యంలో ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ శనివారం సాయంత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువజనులు చేపట్టిన ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. విద్యార్థుల మరణాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమాలపై బలప్రయోగం, పోలీసు చర్యలను ఖండిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో చేపట్టిన ఆందోళనలను అణచివేయడం తగదన్నారు.నీట్ పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించాలని, ఉద్యమాల్లో పాల్గొన్న విద్యార్థులు, యువజనులపై నమోదైన కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఆందోళనల సందర్భంగా అతిగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పాలన సాగించాలని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు "నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు జోహార్లు", "భారత రాజ్యాంగం వర్ధిల్లాలి", "పోరాడితే పోయేది బానిస సంకెళ్లు తప్ప మరొకటి కాదు" అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, కార్యదర్శులు ఏ. రాజేశం, రాజిరెడ్డి, జి. లక్ష్మణ్, నాయకులు శ్రీనివాస్, పోషన్న, బాపు, సత్యనారాయణ, బి. మల్లయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :