Friday, 31 July 2026 09:14:00 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​మంత్రి వివేక్ చొరవతో 213 మంది సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు భద్రం

హర్షం వ్యక్తం చేసిన కార్మికులు

Date : 22 May 2026 03:20 PM Views : 837

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి ఏరియా సెక్యూరిటీ కార్యాలయంలో కాంట్రాక్ట్ గడువు ముగిసిందనే నెపంతో తొలగించిన 213 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఉద్యోగ సమస్య ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో తమకు తిరిగి ఉద్యోగాలు లభించనున్నాయని సెక్యూరిటీ గార్డులు ఆనందం వ్యక్తం చేశారు.దాదాపు రెండు నెలలుగా ఉద్యోగాలు లేక, జీఎం కార్యాలయం చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే తమ సమస్యను హైదరాబాద్ సచివాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల బాధలను ఓపికగా విన్న మంత్రి.తక్షణమే స్పందించి సింగరేణి సి.అండ్.ఎమ్.డి బుద్ధా ప్రకాష్‌తో మాట్లాడారు. మానవీయ కోణంలో ఆలోచించి కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ​మంత్రి ఆదేశాలతో స్పందించిన యాజమాన్యం.మరో 5 రోజుల్లో నూతన టెండర్ పద్ధతి ద్వారా 213 మందిని తిరిగి విధుల్లోకి తీసుకోనుంది. తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచి, ఉద్యోగాలు ఇప్పించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి సెక్యూరిటీ గార్డులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కుటుంబాలతో కలిసి మంత్రికి కృతజ్ఞత సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, నాయకులు జావీద్, ఈసక్, మరియు సెక్యూరిటీ గార్డులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :