Sunday, 02 August 2026 07:12:07 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

బిఆర్ఎస్ నేతల విమర్శలు హాస్యాస్పదం: చెన్నూరు కాంగ్రెస్ నాయకులు

Date : 04 May 2026 04:07 PM Views : 233

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మున్సిపల్ పట్టణంలో జరుగుతున్న శరవేగంగా అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పట్టణంలో సిమెంటు రోడ్లు, సోలార్ హైమాస్ లైట్ల ఏర్పాటుతో పాటు 100 పడకల ఆసుపత్రి త్వరలో ప్రారంభం కాబోతుందని వారు తెలిపారు.అంబేద్కర్ చౌక్ నుండి కోటపల్లి బస్ స్టాప్ వరకు 60 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సహకరిస్తుంటే, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచనతో కొందరు నేతలు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.గతంలో నోటీసులు ఇవ్వకుండానే క్యాంప్ ఆఫీస్ ముందు చిన్న వ్యాపారులను తొలగించిన చరిత్ర బాల్క సుమన్‌దని, 2019లో రోడ్డు వెడల్పు చేస్తానని చెప్పి వ్యాపారుల ప్రలోభాలకు లొంగి ఆ పనులను అప్పట్లో ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.మహంకాళి వాడలో రైతుల ఇళ్లను కూలగొట్టినప్పుడు లేని 'నోటీసుల' నియమం ఇప్పుడే గుర్తొచ్చిందా అని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డిని నిలదీశారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో మూడు సార్లు చర్చించి, అందరికీ నోటీసులు ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టామని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకపు వినయ్ కుమార్, కౌన్సిలర్లు అంబటి శంకర్, పెండ్యాల సాగర్, అజ్జు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: