వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జర్మనీ సహా పలు విదేశాల్లో ఉద్యోగాల కోసం తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలోని స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించిన జర్మనీ జాబ్ ట్రైనింగ్ క్యాంప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మందమర్రిలో జూన్ 10, 2026 నుండి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. జర్మనీలో అవకాశాల కోసం జర్మన్ భాషా శిక్షణను టామ్‌కామ్ ప్రత్యేకంగా అందిస్తుంది. జర్మనీతో పాటు ఇజ్రాయెల్, గ్రీస్, జపాన్ దేశాల్లోనూ ఉద్యోగాలకు అవకాశం. మేసన్రీ, ఫార్మసీ, హాస్పిటాలిటీ మరియు ఐటీ రంగాల్లో భారీ డిమాండ్.విదేశీ ఉద్యోగాల పేరుతో మోసగించే ప్రైవేట్ ఏజెన్సీల కంటే ప్రభుత్వ సంస్థ అయిన టామ్‌కామ్‌ను ఆశ్రయించాలని మంత్రి యువతకు సూచించారు. ఉద్యోగం ఖాయమయ్యాకే టామ్‌కామ్ అభ్యర్థులను విదేశాలకు పంపుతుంది. యువత ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని ఆయన పేర్కొన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బడ్జెట్‌లో టామ్‌కామ్‌కు తగినన్ని నిధులు కేటాయించిందని, శిక్షణకు అవసరమైన మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. ఇటీవల ఇజ్రాయెల్‌కు వెళ్లిన భవన నిర్మాణ రంగ నిపుణుల బృందం మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.జర్మనీ పర్యటనలో మన తెలుగు యువత పనితీరును స్వయంగా చూశాను. సరైన శిక్షణ, భాషపై పట్టు ఉంటే విదేశాల్లో అద్భుతమైన కెరీర్ నిర్మించుకోవచ్చు." ఈ కార్యక్రమంలో ఐటీఐ, ఏటీసీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రిని తమ సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదువుకున్న వారు తమ అర్హతకు తగ్గట్టుగా విదేశీ అవకాశాలు పొందవచ్చని మంత్రి భరోసా ఇచ్చారు.
Admin
వాస్తవ గమ్యం