Friday, 31 July 2026 11:31:27 PM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్.

Date : 17 July 2026 08:53 PM Views : 66

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజలకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 4వ వార్డులో మందమర్రి మండల తహసిల్దార్ సతీష్ కుమార్, డి.సి.సి. ప్రతినిధి రఘునాథ్ రెడ్డి లతో కలిసి, మందమర్రి మున్సిపాలిటీలోని 19వ వార్డులో మండల తహసిల్దార్ తో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజ్ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం ఆగస్టు 3వ వరకు పొడిగించిందని, జిల్లాలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని అధికారులకు సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్లకు అందించిన ఎన్యుమరేషన్ ఫారాల సేకరణలో బూత్ స్థాయి ఏజెంట్లు అధికారులకు సహకరించాలని తెలిపారు. నింపిన ఫారాలలోని వివరాలను బూత్ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు బి.ఎల్.ఓ. యాప్ లో స్పష్టంగా నమోదు చేయాలని, అర్హత గల ఓటర్లు స్వయంగా ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చేపట్టాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి కొనసాగుతున్న అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. వర్షాకాలం అయినందున అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించాలని, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ఇంటర్మీడియట్ కు ఆధునికరించడం జరిగిందని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: