Sunday, 02 August 2026 04:53:08 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

అటవీ అధికారుల వేధింపుల వల్లే రైతు ఆత్మహత్యాయత్నం

బిజెపి రాష్ట్ర నేత కొయ్యల ఎమ్మాజీ.

Date : 16 July 2026 09:10 PM Views : 81

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : అటవీశాఖ అధికారులు వేధింపులకు గురి చేయడం,భూమిని సాగు చేయనివ్వక పోవడం వల్లనే నూకల తిరుపతి అనే పేద రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కొయ్యల ఏమాజి విమర్శించారు. వేమనాపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన నూకల తిరుపతి అనే రైతు పురుగుల మందు తాగి బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏమాజి ఆసుపత్రికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సంవత్సరం అటవీశాఖ అధికారులు వ్యవసాయ పంటలు సాగు చేయనివ్వక పోవడం వల్లనే మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన అటవీశాఖ అధికారులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని లేకుంటే దాడులు తప్పవని హెచ్చరించారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :