Saturday, 01 August 2026 02:00:55 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​జూలై 26న వైభవంగా ‘శ్రీ శ్రీ శ్రీ గాంధారి ఖిల్లా మైసమ్మ బోనాల జాతర’

Date : 12 July 2026 06:33 PM Views : 165

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి బోనాల జాతర తేదీ ఖరారైంది. ఈ ఏడాది జూలై 26వ తేదీన (ఆదివారం) జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ మరియు కుల పెద్దలు అధికారికంగా ప్రకటించారు. ​ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం, గాంధరికీల్లా ఆలయ కమిటీ,ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల జూలై 26 గాంధారి ఖిల్లా మైసమ్మ ఆలయం కమిటీ మరియు ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం ఆధ్వర్యంలో.ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమూల్యమైన ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.ఈ సమావేశంలో నాయకపోడ్ సేవాసంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొమ్ముల బాపు, ఆలయ కమిటీ చైర్మన్ రొడ్డ రమేష్, హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్న, జిల్లా జనరల్ సెక్రటరీ సంజీవ్, తుడుందెబ్బ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జెక శేఖర్, ఉపాధ్యక్షులు లౌడం రాజుకుమార్, అలాగే ముఖ్య నాయకులు బైరినేని లక్ష్మణ్, బద్ది శ్రీనివాస్, చేనెని ప్రదీప్ మరియు ఆలయ పూజారులు రమేష్, శ్రీధర్, అనిల్, రాజేష్, లక్ష్మణ్, కూన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: