Sunday, 02 August 2026 07:28:17 AM
# ఆదివాసీలా 12 సంవత్సరాల కష్టానికి ఈరోజు ఫలితం # ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం పంపిణీ # భారీ వర్షాలు: అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి # ​మందమర్రిలో అక్రమ ఫంక్షన్ హాల్ భూమి ప్రభుత్వ వశం: # *మన గ్రోమోర్ వ్యాపార కేంద్రాన్ని ప్రారంభం # కొమురవెల్లి కాలును పరిశీలించిన రెబ్బన ఎమ్మార్వో # ప్రజలు ఎవరు బయటకి వెళ్లకూడదు రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ # భారీ వర్షాన్నీ లెక్కచేయని తిర్యాణి ప్రజలు.* # అటవీ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పులుల దినోత్సవం. # ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ

​కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బీజేపీ నాయకులు.

మందమర్రి మున్సిపల్ ఎన్నికలపై వినతి

Date : 18 July 2026 08:49 PM Views : 69

వాస్తవ గమ్యం / తెలంగాణ / హైదరాబాదు : మందమర్రి మున్సిపాలిటీలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించి, త్వరితగతిన ఎన్నికలు జరిపించాలని కోరుతూ శనివారం కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని పలువురు నాయకులు కలిశారు.ఈరోజు హైదరాబాద్‌లోని కేంద్ర మంత్రి నివాసంలో అందుగుల శ్రీనివాస్,పుస్కూరి పవన్ రావు, మాయ రమేష్ తదితరులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా మందమర్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సాంకేతిక, పరిపాలనాపరమైన అడ్డంకులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ప్రజలకు మెరుగైన ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన అందాలంటే త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి.నాయకుల వినతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మందమర్రి మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు తన వంతుగా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని, త్వరలోనే ఎన్నికలు జరిగేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: